విద్యుత్ సంస్థ ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్న డిమాండ్
On
విశ్వంభర, భద్రాచలం: 1999 నుండి 2004 మధ్యకాలంలో విద్యుత్ సంస్థలో చేరిన ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ గట్టి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సంఘం (JAC) సభ్యులు నేడు భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావును కలిసి, తమ వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, “విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ ఉపముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లతాను. త్వరలోనే ప్రభుత్వం నుండి ఈ అంశంపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది, అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ భద్రాచలం డివిజన్ ఇంజినీర్ శ్రీ K జీవన్ కుమార్, ADE శ్రీ T వేణుగారు (OC అసోసియేషన్), డిప్లమా అసోసియేషన్ తరపున శ్రీ K రాజారావు, 1104 యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీ అశోక్, 327 యూనియన్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, CITU యూనియన్ NPDCL కంపెనీ సెక్రటరీ శ్రీ వెంకటరాజు, SC/ST అసోసియేషన్ జిల్లా నాయకులు శ్రీ ఉదయ్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారానికై ఐక్యంగా పోరాటం చేస్తూ, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు అందజేస్తున్నట్టు తెలిపారు.