స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు!

స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు!

అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు.. వీటి తర్వాత అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. అయితే.. జూలైలో నిర్వహించాలని మొదట భావించింది. కానీ.. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో జరిగేలా ఉన్నాయి. దీనికి బలమైన కారణం బీసీల రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్ ఖరారు కాకుండా, ఎన్నికలు వెళ్లొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.  

బీసీ కులగణన, రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుంది. దీంతో.. జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఆ వెంటనే  మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈలోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల్లో వారి రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 

Read More బైరాముల్ గూడలో సిపిఎం పార్టీ చంపాపేట శాఖ మహాసభ

ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు 23 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో చట్ట సవరణ చేయాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నది. ఇక జూలైలో మండల పరిషత్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం కూడా ముగిస్తే.. వాటికి కూడా  స్పెషల్ ఆఫీసర్లను నియమించే అవకాశం ఉంది. మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి ముగుస్తుంది. అక్కడ కూడా ప్రత్యేక అధికారులను నియమిస్తారు.