ఐటిఐ కాలేజి భవన నిర్మాణ పనులను త్వరిత గతిన ప్రారంభించాలి
ఐటిఐ కాలేజి భవన నిర్మాణ పనులను త్వరిత గతిన
ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
విశ్వంభర భూపాలపల్లి జూలై6
శనివారం కాటారం మండలం గంగారం గ్రామంలో ఐటిఐ కాలేజి నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంగారం గ్రామంలోని కేజీవిబి పాఠశాలకు ఆనుకొని 7 ఎకరాల స్థలాన్ని ఐటిఐ కాలేజి నిర్మాణానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. గతంలో టెండర్లు పిలువగా ఒక గుత్తేదారు నిర్మాణ పనులు దక్కించుకోవడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదని అధికారులు తెలుపగా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేదంటే గుత్తే దారు కాంట్రాక్టు రద్దు చేసి మరొకరికి కేటాయిస్తామని తెలిపారు.
స్థలం అన్యాక్రాంతం కాకుండా స్థలం చుట్టూ కంచె వేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఐటిఐ కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.