ఘనంగా నల్ల పోచమ్మ దేవాలయం 8వ వార్షికోత్సవం 

ఘనంగా నల్ల పోచమ్మ దేవాలయం 8వ వార్షికోత్సవం 

విశ్వంభర, గౌలిపుర : శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవాలయం సిఐబి క్వార్టర్స్ గౌలిపురలో ఎనిమిదో వార్షికోత్సవం ఆధార్ల మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పురాతనమైన రెండు రాళ్ల రూపంలో వెలిసిన అమ్మవారు దినదినాభివృద్ధి చెందుతూ నల్ల పోచమ్మ, ఎర్ర పోచమ్మ గా గౌలిపుర లోని ఆడపడుచులు కొంగుబంగారంగా నిలుస్తూ అనుకున్న కోరిక నెరవేరుస్తూ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుంచి సేవలు కొనసాగుతాయని ఆలయ కమిటీకి సభ్యులు తెలిపారు. ముఖ్యంగా ఉదయం 5 గంటల నుండి కార్యక్రమం మొదలు అభిషేకము,గణపతి పూజ,పుణ్యాహవాచకం, తోడసి మాత్రిక,మహాకాళి,మహాలక్ష్మి,మహా సరస్వతి పూజ,నవగ్రహ, పంచలోకపాలక,అష్టదిక్పాలక పూజలు,అన్ని దేవతల ఆవాహం తర్వాత,హోమం,పూర్ణాహుతి బలిహరణంతో,మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్విరామంగా కార్యక్రమాలునిర్వహిస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆదర్ల మహేష్ జ్యోతి దంపతులు మధుసూదన్ రావు లావణ్య దంపతులు రామ్మూర్తి రమాదేవి దంపతులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రధాన కార్యదర్శి జిపి సురేష్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ కే దేవేందర్, కౌడి  సురేందర్,ఎల్ రమేష్,ఏ దయానంద్, ఆధర్ల భార్గవ్,  అఖిల్,కే వెంకటేష్ గౌడ్, దుంకి యాదగిరి,రవికుమార్,బ్రహ్మానందం ట్రెజరర్ పాల్గొన్నారు.
 
 
 
 
 

Tags: