ఈ నెల 27న ఆదివారం మెగా రక్తదాన శిబిరం - మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ 16వ వార్షికోత్సవం
ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న , వనస్థలిపురం ఎసిపి కాశిరెడ్డి లకు ఆహ్వానం
On
విశ్వంభర, బిఎన్ రెడ్డి నగర్: మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ పదహారవ వార్షికోత్సవం సందర్భంగా వైదేహి నగర్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. 27/04/2025 ఆదివారం రోజున రోడ్ నెంబర్ 3/5 వైదేవి నగర్ పార్క్ లో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపునకు ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యులు గోరేటి వెంకన్న, వనస్థలిపురం ఎసిపి పి కాశిరెడ్డి లను ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డును సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.