బోనాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు
On
విశ్వంభర, హరి బౌలి : హరిబౌలి లోని అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో ఆదివారం భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆదివారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ట్రాఫిక్ అడిషనల్ డిసిపి రాందాస్,చత్రినాక ఏసీపీ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఏసిపి లక్ష్మణ్, ఫలకు నుమా ఎ డి ఈ రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా 2025 బోనాల ఉత్సవాలను ఘనంగా వైభవంగా నిర్వహించడానికి సహకరించిన వివిధ షాకల ప్రభుత్వాధికారులు,ఆలయాల కమిటీ ప్రతినిధులు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి రాఘవేంద్ర మాట్లాడుతూ బోనాల ఉత్సవాలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా నిర్వహించడానికి సహకరించిన భక్తులకు కమిటీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు,. కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు గుర్నాథ్ రెడ్డి, బుల్లెట్ శ్రీధర్, చత్రినాక ఇన్స్పెక్టర్, మొగల్పు ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు, ఆదిరెడ్డి,కైలాస్ గంగపుత్ర, గాజుల అంజయ్య,, మధు, ఆనందో శ్రీకాంత్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు




