బొడ్డు చంద్రయ్య మృతి తీరని లోటు
కుటుంబానికి తెలంగాణ ఉద్యమఫోరం నాయకుడు పరామర్శ
On
విశ్వంభర, రామన్నపేట: మండల కేంద్రానికి చెందిన బొడ్డు చంద్రయ్య ఆదివారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్ కే చాంద్ బొడ్డు చంద్రయ్య బౌతిక కాయాన్ని సందర్శించి, మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతానం తెలియజేశారు. అనంతరం తన వంతుగా ఆర్థిక సహాయము బొడ్డు చంద్రయ్య కుమార్తె జ్యోతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. బొడ్డు బాబు రావు, బొడ్డు వెంకటేశం, స్వామి, భీంపాక విజయ్, మల్లేశం, రాములు తదితరులు పాల్గొన్నారు.



