మూడు జోన్లుగా తెలంగాణ…సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

మూడు జోన్లుగా తెలంగాణ…సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

విశ్వంభర, హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్‌లో ప్రసంగిస్తూ... స్వల్పకాలిక ఆలోచనలు కాదు.. దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నామన్నారు. మొత్తం తెలంగాణకు "గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్” తయారు చేస్తున్నామన్నారు.

రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించామన్నారు. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి.. ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

Read More విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. -సీఐ ఆదిరెడ్డి. -మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు.