బిసి వాదాన్ని గౌరవించని వారిని విస్మరించాలి.  తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు - రాపోలు వీర మోహన్ 

బిసి వాదాన్ని గౌరవించని వారిని విస్మరించాలి.  తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు - రాపోలు వీర మోహన్ 

విశ్వంభర, హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి వాదం రోజు రోజుకు బలపడుతుండడం చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు బిసీ లను విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అన్నారు. హైదరాబాద్ తుర్కయంజాల రాష్ట్ర కార్యాలయం లో ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా  రాష్ట్రం లో జరుగుతున్న బిసి ఉద్యమాలపై చేనేత సమస్యల పై వివరంగా  మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేసి కులాల లెక్కలు తేల్చి అసెంబ్లీలో బిసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మాణం చేసి ప్రత్యేక ఆర్డినెన్సు తెచ్చి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. 
శాసన సభలో బిసీ లకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు భాజపా శాసన సభ్యులు ఆమోదం తెలపడం జరిగింది. ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపితే ఇప్పుడు వారు పెండింగ్ లో పెట్టడం అనేది హేయమైన చర్యగా అభివర్ణించారు.  భాజపా కు బిసీ పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్న వెంటనే కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి 9 వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.  అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు . అనే విషయాన్ని భాజపా చెప్పాలన్నారు. పాలకులు పార్టీలు ఎన్ని కుతంత్రాలు కుట్రలు పన్నినా బిసి లో చైతన్యం పరిజ్ఞానం వచ్చిందనీ అన్నారు. ఇక మీ ఆటలు సాగవు .. గణనీయమైన మార్పు ఇప్పుడు బి సీ ప్రజలలో అవగాహన కలిగి ఉన్నారు. బిసి యువత ఈనాడు గ్రామ గ్రామాన చైతన్య దిశగా అడుగులు వేస్తున్నారు అని అన్నారు.  రాబోయే కాలంలో తప్పకుండా బి సి ల రాజ్యం ఏర్పాటు కాబోతుంది. ఇందులో సందేహం లేదని వీర మోహన్ చెప్పారు రాష్ట్రం లో ఉన్న బి సీ నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను . మీరంతా ముందు ఒకే వేదికగా ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అందరి అజెండా ఒకే విధంగా ఉండాలి. సమైక్య పోరాటం ఇప్పుడు అవసరం బిసి ల పోరాటం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.  ఈ తరుణం లో మన ఐక్యత మన రాజ్యాధికార కాంక్షకు రాచబాట అని అన్నారు. 42 % బి సి లకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అలాగే రాష్ట్రం లో చేనేత పరిశ్రమ మార్కెటింగ్ సౌకర్యం పై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ని కోరుతూ ఉన్నాను.  రాష్ట్రం లో టెస్కో షోరూమ్స్ ప్రతి జిల్లా కేంద్రం లో ఇతర రాష్ట్రాల రాజధాని నగరాలలో ఏర్పాటు చేయాలని కోరుతూ .. ప్రైవేట్ షాపింగ్ మాల్స్ కు దీటుగా షోరూమ్ లు ఏర్పాటు చేస్తే చేనేత విక్రయాలు పెరిగి చేనేత కార్మికులకు చేతి నిండా సంవత్సరం పొడవునా ఉపాధి అవకాశాలు  కలుగుతాయని వీర మోహన్ తెలియ చేశారు. ఈ సమావేశం లో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు జెల్ల పర్వతాలు,  కర్నాటి అశోక్ , జెల్ల రఘు,  సామల మనోహర్ పాల్గొన్నారు. 

Tags: