తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం.
ఆగస్ట్ 6న చేనేత దినోత్సవ వేడుకలు - చేనేత హక్కుల సాధన పై కార్యాచరణ - - రాపోలు వీర మోహన్ నేత - అధ్యక్షులు, తెలంగాణ చేనేత ఐక్య వేదిక
On
ప్రజావిశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఆగస్టు 6 బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని , వనస్థలిపురం RSS గ్రౌండ్ లో నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ నేత తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ , జిల్లాల కమిటీ శ్రేణులు అందరికి సాదర ఆహ్వానం పలుకుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుందని అలాగే , చేనేత హక్కుల సాధన కోసం, చేనేత కార్మికుల ఉపాధి కల్పన, ఆర్ధిక తోడ్పాటు , ప్రభుత్వం ద్వారా నేత కార్మికుల కోసం సంక్షేమ ప్రభుత్వ పధకాల గురించి, భవిషత్తు కార్యాచరణ చేపట్టే కార్యక్రమాల గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర, జిల్లాల కమిటీ సభ్యులు ప్రతిఒక్కరు ఈ కార్యక్రమానికి తప్పకుండ హాజరు కావాల్సిందిగా కోరారు.



