తెలంగాణ సాంస్కృతిక చిహ్నం పీర్ల పండుగ - డా. కాచం సత్యనారాయణ
పీర్లపండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించాలి.
On
విశ్వంభర, హైదరాబాద్ ; హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మొహరం పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం రాష్ట్రస్థాయి సభ జరిగింది. టి ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తలుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం , మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ , ప్రముఖ రచయిత కవులు మాస్టర్ జి , టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ , మొహరం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టన్న, , శ్రీధర్ , సాజిదా సికందర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా డా. కాచం సత్యనారాయణ మాట్లాడుతూ పీర్ల పండుగ సబ్బండ వర్గాలు నిర్వహించే తెలంగాణ సాంస్కృతిక చిహ్నం అన్నారు. ఈ పండుగ నిర్వహణ కొరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తోటే మొహరంను రాష్ట్ర పండుగ గుర్తించాల్సి ఉండినదని, ఆ విధంగా జరగలేదన్నారు. ఇది విషాదం అన్నారు. బతుకమ్మ, బోనాల మాదిరిగా పీర్ల పండుగను కూడా గుర్తింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.



