పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ పరిపాలన: కేటీఆర్

పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ పరిపాలన: కేటీఆర్

తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.

కళాకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించిన రాజముద్రలోని ‘కాకతీయ తోరణం, చార్మినార్’ రాచరిక పోకడలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర గీతంలో ‘గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్’, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప’ అని ఆలపిస్తున్నాం కదా అని ప్రశ్నించారు. సీఎం కేబినెట్‌లో ఎవరికైనా ఆ పాటలో ఏముందో తెలుసా? అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. 

అదేవిధంగా కేటీఆర్ ట్విట్టర్‌లో మరో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి (సీఎం రేవంత్ రెడ్డి) గారూ... ఇదేం రెండు నాల్కల ధోరణి... ఇదెక్కడి మూర్ఖత్వం.. కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం? చార్మినార్ చిహ్నంపై ఎందుకంత చిరాకు?' అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నం తొలగిస్తున్నారని మండిపడ్డారు. అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అని తెలిపారు.

Read More ముషీరాబాద్ పద్మశాలి సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ