ఆత్మరక్షణ కోసం తైక్వాండో దోహదపడుతుంది. - ట్రస్మా  జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు 

 మెడల్స్ సాధించిన తైక్వాండో విద్యార్థులను అభినందించిన ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు 

ఆత్మరక్షణ కోసం తైక్వాండో దోహదపడుతుంది. - ట్రస్మా  జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు 

తైక్వాండో విజేతలకు ఘన సన్మానం
 

విశ్వంభర, చండూరు:  టైక్వాండో నేర్చుకోవడం వలన విద్యార్థులు ఆత్మరక్షణ  పెరగడంతో పాటు, శారీరక దృఢత్వానికి  దోహద పడుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్  డాక్టర్ కోడి శ్రీనివాసులు  అన్నారు. ఈ నెల 25 వ తేదీ ఆదివారం నాడు నల్గొండ జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్  పోటీలు నల్లగొండ  నందు జరిగినవి. ఇట్టి పోటీలలో చండూరు  మండల కేంద్రంకు చెందిన గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొని, ప్రతిభ కనబరిచి పతకాలను సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థుల్లో టి. వేదాన్షి ఒకటవ తరగతి, కె. రిత్విక్ ఏడవ తరగతి, ఎం మధు శ్రీ 8వ తరగతి ముగ్గురు విద్యార్థులు  బంగారు పతకంను, ఎం ఉదిత్ వెండి పతకంలను సాధించారు. పతకాలను సాధించిన విద్యార్థులను ట్రస్మా జిల్లా అధ్యక్షులు,గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్  డాక్టర్ కోడి శ్రీనివాసులు మెడల్స్ ను, సర్టిఫికెట్స్ అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థులు జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పథకాలను సాధించి, పుట్టిన ఊరుకు, చదువుకున్న పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఆత్మ రక్షణ కోసం తైక్వాండో  నేర్చుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ  వెంకన్న, ట్రైనర్ రమేష్, వెంకటేశ్వర్లు, యాదయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-05-28 at 3.12.03 PM

Tags: