ఘనంగా  ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం - హాజరైన ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు

ఘనంగా  ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం - హాజరైన ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు

విశ్వంభర, ఉమ్మడి వరంగల్ జిల్లా :  వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2025- 28 సంవత్సరానికి గాను ఏర్పడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అట్టహాసంగా వెలమ సంక్షేమ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తక్కళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ 
ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. వెలమ కుటుంబ సభ్యులు ఐక్యంగా కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 35 సంవత్సరాల అనంతరం ప్రత్యక్ష ఎన్నికల్లో తన పట్ల అభిమానంతో గెలిపించిన వెలమ సంఘం సభ్యులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.మా సంఘం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గెలుపొందిన నడిపల్లి వెంకటేశ్వరరావును వెలమ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు,కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్రావు, ఉపాధ్యక్షులు పిన్నింటి బాలచందర్ రావు,శ్యామ్ సుందర్ రావు,కోశాధికారి స్వామి,కార్యవర్గ సభ్యులు , తక్కళపల్లి అమృత రావు, గండ్ర గోపాల్ రావు, చెన్నమనేని జయశ్రీ, లింగంపల్లి పాపారావు, ఎన్నమనేని శ్రీనివాస రావు, గుజ్జ గోపాల్ రావు, జలగం రంజిత్ కుమార్, పిన్నింటి వెంకటేశ్వరరావు, ప్రణీత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మార్నేని వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags: