సన్ షైన్ పాఠశాలలో స్వచ్ఛదనం-పచ్చదనం అవగాహన కార్యక్రమం., 

సన్ షైన్ పాఠశాలలో స్వచ్ఛదనం-పచ్చదనం అవగాహన కార్యక్రమం., 

విశ్వంభర, చండూర్ : సన్ షైన్ పాఠశాలలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛదనం-పచ్చదనం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతు ప్రతి ఒక్కరు తమ ఇంటితో పాటు పరిసరాలను కూడ పరిశుభ్రంగా ఉంచుకుంటూ పచ్చదనంలో భాగం ఒక్కొక్క మొక్కను నాటాలని అన్నారు. అందులో భాగంగా  విద్యార్థిని విద్యార్థులకు డ్రాయింగ్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ, ప్రిన్సిపాల్ రవికాంత్,  ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అరవింద్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్-జి.యాదయ్య, బిల్ కలెక్టర్ విజయ,మంజుల, రమేష్ పాల్గొన్నారు.

 

Tags: