విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం -   ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

విశ్వంభర,  చండూరు: స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో  ఆదివారం నాడు శ్రీ శ్రీనివాస హాస్పిటల్స్ మరియు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గాంధీజీ విద్యాసంస్థల సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 400 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మెడిసిన్స్ ను అందించారు. ఈ వైద్య శిబిరంలో నొప్పులు, ఎముకల జాయింట్స్, బిపి, షుగర్, కిడ్నీ మరియు స్త్రీల వ్యాధుల విభాగాలకు సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి వైద్యులు విచ్చేసి పరీక్షలు నిర్వహించి, సలహాలు సూచనలు అందించి, ఉచితంగా మందులను అందజేశారు. అదేవిధంగా రక్తపోటు తనిఖీలు, షుగర్ పరీక్షలు, డెన్సిటీ టెస్ట్ లను ఉచితంగా నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం అద్భుతమైన విజయాన్ని సాధించి, 400 మందికి విలువైన ఆరోగ్య సేవలు అందించింది. ఇలాంటి మంచి కార్యక్రమంను ప్రజలకు నిర్వహించినందుకు గాను శ్రీనివాస హాస్పిటల్ మరియు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థలు మరియు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మరియు రైస్ మిల్ అసోసియేషన్ నల్గొండ తాలూకా సెక్రెటరీ తేలుకుంట్ల శ్రీనివాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, జె. నరేందర్ రెడ్డి, నొప్పుల స్పెషలిస్ట్ డాక్టర్ గంగాధర్, యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ నిషిత్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మారుతీ రావు , ఫిజియోథెరపీ డాక్టర్ సౌమ్య, ఫార్మసిస్టు వెంకట్ రెడ్డి, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ముషరఫ్, పావని, మౌనిక, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు, ఆంజనేయులు, విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

Tags: