పద్మశాలి మహాసభను విజయవంతం చేయండి.
- పద్మశాలి మహాసభ కరపత్రం, వాల్ పోస్టర్ ఆవిష్కరణ
- మార్చి 9న భారీ ఎత్తున పద్మశాలీలు తరలిరావాలి.
- పద్మశాలి సంఘం ఎల్బీనగర్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత
విశ్వంభర, సరూర్ నగర్ : మార్చి 9న జరిగే పద్మశాలి మహాసభకు సంబందించిన కరపత్రం, వాల్ పోస్టర్ ను సరూర్ నగర్ లోని పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయంలో అధ్యక్షడు పున్న గణేష్ నేత ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అఖిల భారత పద్మశాలి మహాసభ , తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్చి 9 న హైద్రాబాద్ లోని , నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే మహాసభకు పద్మశాలీలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటు తనానికి గురై , క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నా, పద్మశాలి సమాజ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలనే లక్ష్యంతో, అఖిల భారత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే సభకు ఎల్బీనగర్ నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలనీ కోరారు. ఈ మహాసభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లకు సంబందించిన అధ్యక్షులకు దిశ నిర్దేశం చేశారు. అలాగే మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ, ఎంఎల్ఏ, ఎంఎల్సీ లు, అన్ని రాష్ట్రాలకు చెందిన పద్మశాలి ప్రముఖులు, కార్పోరేషన్ చైర్మన్లు పాల్గొంటారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. మహాసభకు రావడానికి ప్రత్యేక బస్సు లను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గుడ్డం లక్ష్మీనారాయణ, కౌకుంట్లు రవితేజ, గుర్రం శ్రావణ్, తలాటి రమేష్, జెల్ల సూర్య కాంత్, పడాల రవీందర్, సీతా వెంకటేశ్, జెల్ల జగన్నాధమ్, దోర్నాల చంద్రమౌళి, సంగెపు రమేష్, కస్తూరి శ్రీనివాసులు, చిట్టిప్రోలు శ్రీనివాస్, మాకం గోపాల్, రావిరాల సంధ్యారాణి, చెరిపల్లి వర్ణలీల, చిక్క భారతమ్మ, పూర్ణిమ, బొడ్డు అశ్విత, చెరిపల్లి శంకర్, జి.శంకర్, పేర్ల వెంకటేశ్, రమేష్ కుమార్, ఏలే మహేశ్ నేత తదితరులు పాల్గొన్నారు .



