అపోలో డయాలిసిస్ క్లినిక్ ప్రారంభం
On
విశ్వంభర, వరంగల్ : అపోలో హెల్త్ , లైఫ్ స్టైల్ లిమిటెడ్ కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్స్ తన కొత్త డయాలిసిస్ కేంద్రాన్ని వరంగల్ జిల్లా మూడో డివిజన్ ఆరేపల్లిలోనీ అపోలో రీచ్ ఎన్ ఎస్ ఆర్ హాస్పిటల్ ప్రారంభించింది. తదనంతరం వైద్యులు మాట్లాడుతూ మూత్రపిండ సమస్యలు (కిడ్నీ సమస్యలు) ఎదుర్కొంటున్న రోగులకు అత్యుత్తమ డయాలిసిస్ వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. డా. నిర్మల్ పాపయ్య ఎం.డి., డీఎమ్., సీనియర్ నెఫ్రోలజిస్ట్, సంపత్ రావు, చైర్మన్ ఎన్ ఎస్ ఆర్ గ్రూప్
హాస్పిటల్లో అపోలో డయాలిసిస్ క్లినిక్ ను ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయం అని అన్నారు. అధునాతన కిడ్నీ చికిత్సను అందించడంలో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.