ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కౌన్సిలింగ్ ప్రారంభం
On
విశ్వంభర, హనుమకొండ: టీజీఈసిఈటి 2025అడ్మిషన్లు17 నుండి 19 వరకు హన్మకొండలోని సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్లాట్ ఎంచుకున్న విద్యార్థులకు రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ , కౌన్సెలింగ్ సెంటర్ ఇన్‌ఛార్జ్ ఎస్.ఎం.రెహమాన్ విద్యార్థికి , ఆర్ఓసి (రిజిస్ట్రేషన్-కమ్-వెరిఫికేషన్ ఫారమ్)ను అందజేస్తున్నారు. డాక్టర్ ఇ.అంజన్ రావు, ఎస్. సుధేర్, ఎ.శ్రీలత, డాక్టర్ నహేదా పర్వీన్, ఎ. రాజేష్, డాక్టర్ బి.సద్ ఆనందమ్, డాక్టర్ హెచ్.రమా దేవి , డాక్టర్ టి.సంజీవ్ కౌన్సెలింగ్ సెంటర్‌లో ఉన్నారు.