నవంబర్ లో ఘనంగా శ్రీ సత్య సాయి శత జయంతోత్సవాలు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహణ
నవంబర్ 15 నుండి 24వ తేదీ వరకు వేడుకలు - కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణెంపై సత్య సాయి ప్రతిమను ముద్రించిన నాణెం విడుదల
On
- వేడుకలకు రాష్ట్ర , కేంద్ర మంత్రులు
- విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని వెల్లడి
- శ్రీ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షులు నిమిష్ పాండ్య వెల్లడి
విశ్వంభర, హైదరాబాద్ ; శ్రీ సత్య సాయి 100వ జన్మదిన కార్యక్రమాలను ఇరు రాష్ట్రాలలో నవంబర్ 15 నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షులు నిమిష్ పాండ్య అన్నారు. హైదరాబాద్ అంబర్ పేట శివం రోడ్డులోని శ్రీ సత్య సాయి సేవ సంస్థలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్య సాయి శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతాయని అన్నారు. శ్రీ సత్య సాయి "అందరిని ప్రేమించండి _ అందరిని సేవించండి" అనే సూక్తి ద్వారా ప్రతి ఒక్కరి ఆ పిలుపు ద్వారా సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని అన్నారు. శ్రీ సత్య సాయి జన్మదినం నాడు రాష్ట్ర మంత్రులే కాక కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా శ్రీ సత్య సాయి జన్మ దినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతే కాకుండ కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణెంపై సత్య సాయి ప్రతిమను ముద్రించిన నాణాన్ని విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమoలో శ్రీ సత్య ట్రస్ట్ కన్వీనర్ హెచ్ జే దొర, జాతీయ, రాష్ట్ర సమన్వయ కర్తలు, రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.



