SPR స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో ఘనంగా ఫేర్ వెల్
విశ్వంభర, హనుమకొండ : హసన్పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామంలో SPR స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు విచ్చేశారు. ఎస్ పి ఆర్ స్కూల్ డైరెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ 2009లో 135 మంది విద్యార్థులతో స్థాపించిన ఈ స్కూల్ నేడు 16 సంవత్సరాల కాలవ్యవధిలో 1600 మంది విద్యార్థులతో సాగుతుందని అన్నారు. విద్యార్థుల భావితరాల భవిష్యత్తుకై విద్యార్థులలో ఉండే ప్రతిభ తెలుసుకొని విద్యార్థులను తీర్చిదిద్దడంలో మా SPR స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్కూల్ ఎప్పుడు ముందుంటుందని, 16 సంవత్సరాలు ఆ నమ్మకంతో పనిచేయడం వల్లనే తల్లిదండ్రులు నమ్మి మా ఎస్పిఆర్ స్కూలు ను ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థినిలు సాంస్కృతిక ఆటపాటలతో అందరి అలరించారు. ఈ కార్యక్రమంలో SPR స్కూల్ చైర్మన్ శ్రీపతి రెడ్డి ప్రిన్సిపల్ శేషగిరిరావు ఉపాధ్యాయులు హాస్టల్ సిబ్బంది విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.