క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి - ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
On
విశ్వంభర, వరంగల్ : స్పోర్ట్స్ కౌన్సిల్ వరంగల్ ఆధ్వర్యంలోనేడు జేఎన్ఎస్ స్టేడియం లో తెలంగాణ ట్రాన్స్కో & డిస్కమ్స్ కు సంబంధించి 2025-2026 సంవత్సరానికి ఇంటర్ సర్కిల్ కబడ్డీ & బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లను ఈ నెల 12 నుండి 14 వరకు నిర్వహిస్తున్నారు . ఈ కబడ్డీ & బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించారు . ముందుగా స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసికంగా, శారీకంగా చురుకుగా ఉంటామని, పనిలో మరింత ఉత్తేజంతో పనిచేస్తామని అన్నారు . వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆటలు ప్రముఖ పాత్ర వహిస్తాయని అన్నారు . ఆటపోటీల వలన విద్యుత్ శాఖ ల మధ్య మరింత స్నేహ పూర్వక బంధం బలపడుతుందని అన్నారు. ఎవరు గెలిచినా ఓడిన అన్నతమ్ముళ్లు అనే భావన ఉండాలని అన్నారు . వృత్తి తో పాటు మీకు ఇష్టమైన ఆటలు కొనసాగిస్తున్నారని తెలిపారు . నాకు క్రీడల అంటే చాల ఇష్టం అన్నారు . గెలుపోటములు సహజమని అందరు టీం స్పిరిట్ తో ఆడాలని పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ లో పనిచేసే ఉద్యోగులంత ఒక ఫ్యామిలీ గా ఉంటరాని అన్నారు . ఈ పోటీలలో కబడ్డీ 12 జట్లు , బాల్ బ్యాడ్మింటన్ 9 జట్లు పాల్గొంటాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇంచార్జి డైరెక్టర్లు బి . అశోక్ కుమార్ , టి . సదర్ లాల్ , వి. తిరుపతి రెడ్డి , హన్మకొండ ఎస్ ఈ పి . మధుసూదన్ రావు , డి .ఈ టెక్నికల్ ఏ . విజయేందర్ రెడ్డి , స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్ జగన్నాధ్ , ట్రెజరర్ ఎమ్ . సంతోష్ , కౌన్సిల్ మెంబెర్స్ : యండి . యాకుబ్ పాషా , వి . సునీల్ కుమార్ , ఈ ప్రేమ్ కుమార్ అన్ని సర్కిళ్ల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు .



