విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేక పూజలు

నిర్వహించిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి దంపతులు

విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేక పూజలు

విశ్వంభర, రంగారెడ్డి: నందిగామ మండలంలోని మోత్కులగూడ గ్రామంలో గురువారం శ్రీ వినాయక స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా సాగుతుంది. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీని  గ్రామస్తులు, దేవస్థానం యాజమాన్య కమిటీ సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు నిర్వహించిన అధివాస హోమములు, శయ్యాధివాసము, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మరియు వినాయక, ధ్వజ స్థంభ ప్రతిష్ఠా కార్యక్రమములు, పూర్ణాహుతి కార్యక్రమాలలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరము వేద పురహితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదములు ఇచ్చి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాల పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల వలన, వేద పురోహితుల వేదమంత్రోచ్ఛరణాలతో ప్రకృతి పరవశించి పులకరించి గ్రామ అభివృద్ధికి సహకారం జరుగుతుందని అన్నారు. భక్తి భావం వలన ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, ఈర్ష, ద్వేషం, అసూయ లాంటి దుర్గుణాలు తొలగిపోయి, భగవత్ సాహిత్యం వలన మనిషి మనసులో ప్రశాంతత పెరిగి సద్గుణాలు కలుగుతాయని, తద్వారా గ్రామస్తులందరి మధ్యన మంచి సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. ఈ దేవాలయపున నిర్మాణ కార్యక్రమానికి తన వంతు సహాయంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇప్పటికే 4,00,000 రూపాయల విరాళాలు ఇవ్వగా గ్రామస్తులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోత్కూలగూడ మాజీ సర్పంచ్ నర్సిములు, మామిడిపల్లి ఎంపిటిసి కట్న మాధవి రవీందర్, మొదళ్లగూడ మాజీ సర్పంచ్ ఉమా ప్రవీణ్ రెడ్డి, వీర్లపల్లి మాజీ ఎంపీటీసీ కాట్నాలత శ్రీశైలం, అప్పారెడ్డి గూడా మాజీ సర్పంచ్ జేకే నర్సింహులు, బండోని గూడ మాజీ సర్పంచ్ జెట్ట కుమార్, యండి బేగ్, ఉపసర్పంచ్ శివకుమార్, సింగల్ విండో డైరెక్టర్ నర్సింహా గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, జెట్ట రమెష్, నగేష్, ఈదులపల్లి గణేష్ గౌడ్, శ్రవణ్ గౌడ్, దినేష్ సాగర్, శివ చారి, మాజీ వార్డ్ మెంబెర్స్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags: