భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకోండి. 

భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకోండి. 

విశ్వంభర , చండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమం తుమ్మలపల్లి,  తిమ్మారెడ్డి గూడెం రెవిన్యూ గ్రామాలలో తహశీల్దార్  కిరణ్మయి, డీటీ  నిర్మల లు ప్రారంభించారు. ఈ గ్రామసభలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొరిమి ఓంకారము సందర్శించి భూ సంబంధిత సమస్యలు వున్న రైతులు తమ సమస్యలు వ్రాతపూర్వకంగా తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమము లో ఎఎంసి  వైస్ చైర్మన్ పోలు వెంకట్ రెడ్డి, మాజీ  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శుజావుద్దిన్, పల్లె వెంకన్న, మార్కేట్ డైరక్టర్ భూతరాజు ఆంజనేయులు , మాజీ సర్పంచ్ అబ్బనబోయిన లింగయ్య, మాజీ ఎంపీటీసీ ఇరిగి రాజు, ఎఫ్ ఎస్ సి ఎస్ డైరక్టర్ కట్ట బిక్షం, తుమ్మలపల్లి దేవస్థానం చైర్మన్ గునురెడ్డి రామలింగారెడ్డి , మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , కురుపాటి శేఖర్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కరుణాకర్ ఇద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: