షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

 

ఈ నడుమ వరుసగా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బూర్గుల గ్రామ శివారులోని స్థానిక సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలింది. 

Read More BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా ఇందులో పనిచేస్తున్న కార్మికులు ఆరుగురు చనిపోయారు. ఇంకో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక సేవలు అందిస్తున్నారు. అయితే గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా