గనులు, భూగర్భశాఖలో ఆరుగురు అధికారులపై వేటు

గనులు, భూగర్భశాఖలో ఆరుగురు అధికారులపై వేటు

తెలంగాణ గనులు, భూగర్భశాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆరుగురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.

తెలంగాణ గనులు, భూగర్భశాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆరుగురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. గనుల శాఖలో డిప్యుటేషన్‌పై జీఎంలుగా పనిచేస్తున్న పాండురంగారావు, దేవేందర్‌రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్లు దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌పై వేటు పడింది. వీరిపై అవినీతి ఆరోపణల విచారణ అనంతరం ప్రభుత్వం చర్యలు తీసుకుంది.