ఫాల్గుణి మేళాకు తరలివచ్చిన శ్యాం బాబా భక్తులు
విశ్వంభర, హైదరాబాదు :ఫాల్గుణి మేళా వేడుకల సందర్భంగా నగరవ్యాప్తంగా సోమవారం ఉదయం నగరం నలుమూలల నుండి నిశాన్ యాత్రలు నిర్వహించారు. భక్తి పారవశ్యంతో భజనలతో నృత్యాలతో భక్తులు కాచిగూడ లోని శ్యామ్ బాబా బాబా మందిరం కు తరలివచ్చారు. నగరంలోని గౌలిగూడ అఫ్జల్గంజ్ నాంపల్లి పాతబస్తీ బేగంబజార్ సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి రంగురంగుల జెండాలను పట్టుకుని యువతి యువకులు ర్యాలీగా శాంభవ మందిరానికి చేరుకొన్నారు. శ్రీకృష్ణ భగవానుడి చిత్రపటాలతో రంగురంగు జెండాల మధ్య తరలి వచ్చారు. బగ్గిలపై శ్రీకృష్ణ భగవాన్ విగ్రహాలను రతాలపై పెట్టుకుని రంగురంగుల పూలు రంగులు చల్లుకుంటూ భజనలను చేస్తూ ర్యాలీగా తరలివచ్చారు. జెండాలను శ్యాం బాబా మందిరంలో స్వామివారి చెంత ఉంచి స్వామివారిని దర్శించుకున్నారు. భారీగా తరలివచ్చిన శాం బాబా భక్తులకు శాం బాబా సేవ మందిర్ సమితి ప్రతినిధులు ఇంద్రకిరణ్ అగర్వాల్ రాందేవ్ అగర్వాల్ రాజు వీక్ తదితరులు స్వాగతం పలికారు.



