అంబేద్కర్ లాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి
-ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. రామచంద్రరావు
విశ్వంభర, భూపాలపల్లి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దేశ వ్యవస్థలన్నీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాయని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. రామచంద్రరావు అన్నారు. మహనీయులు అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద్భంగా జడ్జి మాట్లాడుతూ మహనీయులు అంబేద్కర్ యొక్క స్పూర్థిని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షలు వి. శ్రీనివాస చారి, కార్యదర్శి వి. శ్రావణ్ రావు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కంప అక్షయ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి. ప్రియాంక. స్పెషల్ పి. పి ఎన్. విష్ణువర్ధన్ రావు, మంగలపల్లి రాజ్ కుమార్ , ఇందారపు శివ కుమార్ , సంగెం రవీందర్, కనపర్తి కవిత కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



