బిజేపి మహిళా మోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలుగా శామకుర చిత్రలేఖ మధు ముదిరాజ్

 

నియామకం పత్రం అందజేసిన బిజేపి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్,మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు కస్తూరి మాధురి చంద్ర 
 
 
పాల్గొన్న అత్మకూరు మండల అధ్యక్షుడు గజరాజు కాశినాధ్,మండల నాయకులు

 

WhatsApp Image 2024-07-24 at 14.04.26_fdc2f7de

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఏం) మండలంలోని కోరటికల్ గ్రామానికి చెందిన శామకూర చిత్రలేఖ మధు ముదిరాజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపా అధ్యక్షురాలుగా నియమకం అయ్యారు.ఈ మేరకు మహిళా మోర్చ  జిల్లా అధ్యక్షురాలు కస్తూరి మాధురి చంద్ర (బుల్లెట్ మాధురి) నియామక పత్రాన్ని విడుదల చేశారు. మంగళవారం చౌటుప్పల్ లో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని  శామకూర చిత్రలేఖ మధు ముదిరాజు అందుకున్నారు.ఈ సంధర్బంగా బిజేపి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ మాట్లాడుతు జిల్లాలో  బిజేపి మహిళా మోర్చా బలోపితానికి కృషి చేయాలన్నారు.బిజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు గా ఎన్నికైన శామకూర చిత్రలేఖ మధు ముదిరాజ్ మాట్లాడుతు రాష్టంలో మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టడంలో గత బిఆర్ఎస్,నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు.బిజెపి మహిళా మోర్చ ఆధ్వర్యంలో జిల్లాలో మహిళా సమస్యలపై,వారి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలపై త్వరలో కార్యాచరణ చేపడుతామని అన్నారు.నాపై నమ్మకంతో నా ఎన్నికకు సహకరించిన బిజేపి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కి,బిజేపి మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు కస్తూరి మాధురి చంద్రకి,బిజేపి ఆత్మకూరు (ఎం) మండల అధ్యక్షుడు గజరాజు కాశీనాధ్ కి,జిల్లా , మండల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో బిజేపి, మహిళ మోర్చ బలోపితానికి కృషి చేస్తానని అన్నారు.WhatsApp Image 2024-07-24 at 14.04.25_d4f2a27e

Read More చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయిలో సత్తా చాటిన గాంధీజీ విద్యార్థులు