షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థుల అద్భుత ప్రదర్శన
On
విశ్వంభర, హైదరాబాద్ : ఆదివారం హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యర్యంలో జరిగిన నాలుగోవ ఇంటర్నేషనల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే అండ్ కుంగ్ ఫు ఛాంపియన్ షిప్ - 2025 లో షాద్ నగర్ కు చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబర్చి మెడల్స్, సర్టిఫికెట్స్, కప్ గెలుపొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా సినీ యాక్టర్స్ భానుచందర్, గౌతమ్ నంద పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందచేసిన అభినందించారు. ఈ సందర్బంగా న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్స్ బాలరాజ్, అహ్మద్ ఖాన్ లు భానుచందర్, గౌతమ్ నందలను శాలువ తో సన్మానం చేశారు.