స్వయం పాలన దినోత్సవం
విశ్వంభర,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తిలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో శనివారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీచర్లుగా వ్యవహరించిన స్టూడెంట్స్ తమ అనుభవాలను వివరిస్తూ టీచింగ్ చేయడం అద్భుతమైన కళ అని, దీనికోసం ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాల్సిన అవసరం అవగతమైందన్నారు. కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ మాట్లాడుతూ సంబంధిత కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల గౌరవం, బోధనలో మెలకువలు, లీడర్షిప్ తెలిసి వస్తుందని చెప్పారు. స్కూల్ హెచ్ఎంగా రక్షిత్, కరస్పాండెంట్గా తహసీన్, కలెక్టర్గా ఆప్షన్ మారిఫా, డీజిఓగా అయాన్ తేజ్, ఎంఈఓగా లేహ్య సాయి, ఉపాధ్యాయులుగా రిషి,సుభహాన్, బ్లెస్సినా,వర్షిత్, రిత్విక్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



