రంగాపురం లో జన్మించి డాక్టరేట్ పట్టా పొందిన ఆణిముత్యం పోలినేని స్వీయ

రంగాపురం లో జన్మించి డాక్టరేట్ పట్టా పొందిన ఆణిముత్యం పోలినేని స్వీయ

విశ్వంభర, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో ఓ ఆణిముత్యం జన్మించింది. పుట్టిన ఊరికి,  కన్న తల్లిదండ్రులకు, చదువు నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. కాళోజి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో డాక్టరేట్ పట్టా పొంది వైస్ ఛాన్స్ లర్ నంద గోపాల్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం డాక్టరేట్ పట్టాను అందుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని అనిత-లింగారావు దంపతులకు జన్మించిన ఏకైక కుమార్తె స్వీయను ఎలాగైనా ఉన్నతమైన చదువులు చదివించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్న పోలినేని స్వీయ తాను ఎలాగైనా డాక్టర్ ను కావాలనే సంకల్పంతో ఒక లక్ష్యాన్ని ఎంచుకుంది. చిన్నప్పటి నుంచే తన లక్ష్యసాధన కోసం కష్టంతో కాకుండా ఇష్టపడి చదివేది. ఈ క్రమంలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తేజస్వీ హన్మకొండ నందు, ఇంటర్ విద్యను చైతన్య కాలేజీ హైదరాబాద్ నందు, నీట్ సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట నందు ఎంబీబీఎస్ విద్యను పూర్తిచేసిన స్వీయ సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ నందు డాక్టరేట్ పట్టా పొందింది. ఈ సందర్భంగా కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్స్ లర్ నంద గోపాల్ రెడ్డి చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకోవడం జరిగింది. కాగా తన చిన్నప్పటి స్నేహితుడు పోలినేని లింగారావు కూతురు డాక్టరేట్ పట్టా పొందడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వీయకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో రంగాపురం గ్రామం నుండి ఉన్నతమైన చదువులు చదివి డాక్టరేట్ పట్టా పొందిన స్వీయను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన చదువులు చదివి రాణించాలన్నారు. డాక్టరేట్ పట్టా పొందిన స్వీయను మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు అభినందిస్తున్నారు.

Tags: