ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను  కల్పించాలి. - రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయాలి 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్క దానయ్య

ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను  కల్పించాలి. - రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయాలి 

విశ్వంభర,  హనుమకొండ జిల్లా : రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఐక్యతను కూడా పెట్టి మేనేజ్మెంట్ , ప్రభుత్వ సహకారంతో  అసోసియేషన్ ప్రతినిధులతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్క దానయ్య తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం బాలసముద్రంలోనీ విద్యుత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 22న హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్రంలో ఉన్న మిగతా అసోసియేషన్ల కంటే భిన్నంగా తమ అసోసియేషన్ ను మరింత అభివృద్ధి పరుస్తానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ల పనితీరు మారాల్సిన పరిస్థితి ఉందన్నారు. భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అందాల్సిన హక్కులను కాల రాస్తూ ఈరోజు వరకు కూడా పదోన్నతులు పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 1977లో అమలు చేసిన ఎస్సీ ఎస్టీ జీవో ప్రకారం విద్యాశాఖలో చదువులో వెనుకబడినందుకే ఉద్యోగాలు వచ్చినప్పటికీ పైసలు చదవడానికి రెండు సంవత్సరాల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని జీవో నెంబర్ 342లో తెలిపారు. దురదృష్టవశాత్తు  గత పది సంవత్సరాల నుండి ఈ జీవో ని అమలు పరచాలని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీగా కొనసాగుతూ ప్రజా ప్రతినిధులకు ఉన్నతాధికారుల సృష్టికి తీసుకెళ్లినా అమ్ములకు నోచుకోలేదని ఆరోపించారు. ఈ విషయంపై ప్రస్తుత సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ జీవోను అమలు చేస్తే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అందరూ చదువుకునే అవకాశం ఉంటుందని ఆ దిశగా తన కార్యసిద్ధిని నెరవేర్చుకునేందుకు మొదటి కర్తవ్యం గా తాను ముందడి పోరాడుతానని భీమవరం చేశారు. రాష్ట్రంలో చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయని రోల్ ఆఫ్ రిజర్వేషన్  రాష్ట్రంలో ఉన్న నాలుగు ఎలక్ట్రిసిటీ సంస్థల్లో అమలు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. దీనికి సంబంధించిన 2006లో జీవో కన్వర్షన్ కి సంబంధించి అమలు అయితే రాష్ట్రంలో ఉన్న చాలామంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. దశలవారీగా తమ సంఘాన్ని మరింత బలోపేతం చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలుపరిచే విధంగా మేనేజ్మెంట్ పైన, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకునే దిశగా తమ సంఘం తరపున పోరాడుతామని ధీమా వ్యక్తం చేశారు.

Tags: