అంజిరెడ్డి గెలుపు పట్ల సతీష్ హర్షం

అంజిరెడ్డి గెలుపు పట్ల సతీష్ హర్షం

విశ్వంభర, ఇనుగుర్తి: పట్టభద్రుల నియోజకవర్గమైన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి విజయం పట్ల సామాజిక కార్యకర్త బొమ్మెర సతీష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..ఎస్సార్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందిని అంజిరెడ్డి గోదావరి దంపతులు ఆదుకున్నారన్నారు. పదవిలో ఉన్నా,లేకున్నా వారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలందించడాన్ని విజ్ఞులైన పట్టభద్రులు గుర్తించి ఓట్లు వేసి ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని గెలిపించడం అభినందనీయమని సంతోషం వ్యక్తం చేశారు.

Tags: