కోమాలో ఉండి రక్తం అందక బాధ పడుతున్న శశిధర్ రెడ్డి ని కాపాడి. - ఇద్దరు పిల్లలను రెసిడెన్సీయల్ స్కూల్ లో చేర్పించిన
- సామజిక కార్య కర్త చేపూరి శంకర్
On
ప్రజావిశ్వంభర, ఉప్పల్ : బీరం శశిదర్ రెడ్డి ఉపాధి కోసం స్కూటీపై వెళ్తుండగా నార్లపల్లి వద్ద కారు డీకోంది. తీవ్ర రక్తస్రావమై కోమాలోకి పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న శశిదర్ రెడ్డిని గాంధీ హాస్పిటల్ లో చేర్పించారు. ఆపరేషన్ కోసం A నెగిటివ్ రక్తం కావలసి ఉండగా శశిదర్ రెడ్డి భార్య సుజాత రక్తం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.. ఐనా రక్తం దొరకలేదు. చివరగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ కు ఫోన్ లో తమ సమస్యను తెలియజేయగా...ఆయన వెంటనే స్పందించి వారికీ కావాల్సిన బ్లడ్ అందజేసి శశిదర్ రెడ్డి ప్రాణాలను కాపాడారు. వారి పిల్లల పీజులు కట్టలేకపోతున్నామని సుజాత దంపతులు చేపూరి శంకర్ కు తెలియజేయగా... ఆయన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాలల సెక్రటరీ షపిఉల్లా తో మాట్లాడి హయత్ నగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాల-అంబర్ పేట్ లో ఇద్దరు పిల్లలకు రోహిత్ రెడ్డి, అక్షిత్ రెడ్డికీ అడ్మిషన్లు ఇప్పించారు. ఈ సందర్బంగా చేపూరి శంకర్ మాట్లాడుతూ... మదర్ తెరిస్సా చూపిన బాటలో నేను నడుస్తూ... ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. ఈ కుటుంబానికి ఏ అవసరం వున్నా నా వంతుగా సహాయం చేస్తానని తెలిపారు. వారి పిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్య అవకాశం కల్పింఛానని అన్నారు. మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించిన చేపూరి శంకర్ కు శశిదర్ రెడ్డి, సుజాత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటయ్య, చేపూరి రాజు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



