కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్.. పునరాలోచనలో సర్కార్..!

కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్.. పునరాలోచనలో సర్కార్..!

కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో బిర్యానీ, హంటర్ వంటి కొత్త రకం బీర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త బ్రాండ్లకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మద్యం బ్రాండ్లను మార్చిరాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఇటీవల ఐదు కొత్త బ్రాండ్ల ద్వారా 26 కొత్త బీర్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. 

ఈ బీర్ల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ మేరకు కొత్త బీర్ల అమ్మకాలకు సంబంధించిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో నూతన మద్యం పాలసీ అమలు దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Read More సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

ఈ క్రమంలో అక్కడ కింగ్‌ఫిషర్‌ బీర్లను లోడ్లకు లోడ్లు దించుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ఏ వైన్స్‌కు వెళ్లినా కింగ్ ఫిషర్ బీర్లు లేవంటున్నారు. అదేబ్రాండ్ కావాలనుకునే వారికి కొన్ని చోట్ల రూ.220 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. దీంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల్లో బీర్ల నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. దీన్ని బట్టి తెలంగాణలో కృత్రిమ బీర్ల కొరత సృష్టించారనే అనుమానాలకు తావిస్తోంది.