సాయి శివాని కల్చరల్ ఒకేషనల్ సొసైటీ 24 వ వార్షిక సభలో రాపోలు
On
విశ్వంభర, వరంగల్ :- శ్రీ హర్ష కన్వెన్షన్ లో జరిగిన సాయి శివాని కల్చరల్ అండ్ ఒకేషనల్ సొసైటీ 24 వ వార్షిక సభలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పాల్గొని మాట్లాడారు. వేదిక పై సంస్థ అధ్యక్షురాలు డా. ఎమ్ పద్మజాదేవి కి శుభాకాంక్షలు తెలిపారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు జెల్ల పర్వతాలు, జెల్ల రఘు , కర్నాటి అశోక్ , మంత్రి కమలాకర్ ,సిరిపురం శారద పాల్గొన్నారు



