మహిళల భద్రతకు పెద్దపీట

మహిళల భద్రతకు పెద్దపీట

విశ్వంభర, సిద్దిపేట:  మహిళలు వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా షీ టీమ్‌ను సంప్రదించాలని ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ దుర్గ
సూచించారు. మహిళల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసీఆర్ నగర్ లో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ షీ టీమ్ ఎలా పనిచేస్తుంది, ఆపదలో ఉన్నవారికి ఎలా అండగా ఉంటుందో వివరించారు. ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, సైబర్ బుల్లీయింగ్, మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చైల్డ్ అబ్యూజ్ 'గుడ్-బ్యాడ్ టచ్' పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, టీ-సేఫ్ యాప్ ప్రాముఖ్యత తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే డయల్ 100, షీ టీమ్ నంబర్ 8712667434కు సమాచారం అందించాలని సూచించారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ దుర్గా తెలిపారు. కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ కిషన్ పవార్, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ రజిని, మమత, పోలీస్ కానిస్టేబుల్స్ లక్ష్మీనారాయణ, ప్రవీణ్, స్థానికులు పాల్గొన్నారు.

Tags: