ఆ లోగోతో ఆర్టీసీకి సంబంధం లేదు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్..!

ఆ లోగోతో ఆర్టీసీకి సంబంధం లేదు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్..!

సోషల్ మీడియాలో టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ మేరకు ఇవాళ(గురువారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చిన విషయం తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ మేరకు ఇవాళ(గురువారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 

‘టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. అది ఫేక్ లోగో.. ఆ లోగోతో టీజీఎస్ఆర్టీసీకి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను ఇంకా ఫైనల్ చేయలేదు.’ అంటూ సజ్జనార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More అందెల శ్రీరాములు యాదవ్ ను కలిసిన ఫోర్త్ సిటీ భూ బాధిత రైతులు

ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొన్ని పేర్లను మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగా టీఎస్ స్థానంలో టీజీగా మార్పులు చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీజీగా మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీగా ఉన్న పేరు ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీగా మారింది. ట్విట్టర్‌ ఖాతాల్లోనూ ఈ మార్పులు చేశారు. తాజాగా ఫేక్ లోగో వైరల్ అవుతుండటంతో ఆర్టీసీ ఎండ క్లారిటీ ఇచ్చారు.