పదవికి మాత్రమే విరమణ, ప్రజాసేవకి కాదు
ప్రజాసేవలో ముందుండాలి
బీఆర్ఎస్ యువ నాయకులు మురళీకృష్ణ యాదవ్
విశ్వంభర న్యూస్
జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఎల్కగూడ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి గారు ఏర్పాటుచేసిన ప్రజాప్రతినిధుల పదవీ విరమణ సన్మాన సభలో బీఆర్ఎస్ యువనాయకులు మురళీకృష్ణ యాదవ్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని మాజీ ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవికి మాత్రమే విరమణ అని ప్రజాసేవకు కాదని అన్నారు, అలాగే అన్ని గ్రామాల్లో తమవంతుగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని, ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉంటు నిరంతరం ప్రజ సమస్యలు తీరుస్తు పార్టీ అభివృద్ధి కోసం సహయ సహకారాన్ని అందించాలని కోరారు. మండల మాజీ జడ్పీటీసీ బంగారు స్వరూప రాములు, మాజీ ఎంపీటీసీలు సత్య ప్రమోద్, రాములు, మాజీ కో అప్షన్ సభ్యులు నర్సింగరావు తదితరులని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు హఫీజ్, నాయకులు వెంకటేష్, జబ్బార్, రాంరెడ్డి, యాదయ్య, మానయ్య, రామచంద్రయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.