శ్రీవారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న రాపోలు
విశ్వంభర, జగిత్యాల జిల్లా:- కోరుట్ల పట్టణంలో సుదర్శన యాగ సహిత శ్రీవారి కళ్యాణ మహోత్సవం లో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ పాల్గొన్నారు. ఆదివారం రోజు ధనుర్మాస విశేషమున సుదర్శన యాగ సహిత శ్రీవారి కళ్యాణ మహోత్సవం లో జగద్గురువులు ఆదిశంకరాచార్యులు హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహక కమిటీ ఆర్గనైజర్ పట్టణ పద్మశాలి సంఘం కార్యదర్శి గోసికొండ కుమార స్వామి ప్రత్యేక ఆహ్వానం మేరకు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ హాజరై స్వామి వారి దివ్య మంగళకరమైన ఆశీస్సులు పొంది అనంతరం కార్య క్రమ నిర్వాహకుల చేత సన్మానం స్వీకరించారు. రాష్ట్ర కమిటీ పక్షాన అధ్యక్షుల వారికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.



