వైశ్య రాజకీయ రణభేరికి భారీగా తరలి వెళ్తాం: అమావాస్య అన్న ప్రసాద కమిటీ చైర్మన్ రాజా రాజు.
On
విశ్వంభర, ఉప్పల్; ఆగస్టు 3వ తారీకు న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో జరిగే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమం కు భారీ గా తరలి వెళ్తామని ఫిర్దాజిగూడ అమావాస్య అన్న ప్రసాద కమిటీ, ఆర్యవైశ్య సంఘం చైర్మన్ రాజా రాజు అన్నారు. ఆదివారం ఫిర్జాదిగూడలో రాజారాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకు వాటా కల్పించాలని అన్నారు. కుల గణన నివేదికలోని అగ్రవర్ణాల వివరాలు కులాల వారిగా ప్రకటించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం ఎస్ వి రాజు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమేష్, ట్రెజరర్ ఓంకార్, మాజీ అధ్యక్షుడు మురళి, ధనరాజ్, వెంకటేష్, హరి, ప్రభాకర్ ,చంద్రశేఖర్ , కటకం శేఖర్, కిరణ్ ,గుప్త, సునీల్, భద్రరావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.



