రక్తదానం జీవిత విధానం కావాలి - లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ

 రక్తదానం జీవిత విధానం కావాలి - లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ

విశ్వంభర, నాగర్ కర్నూల్ : రక్తదానం జీవిత విధానంలో భాగంగా మలచుకోవాలని లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు.  తేదీ13-03-25, గురువారం నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల భాగస్వామ్యం తో, లయన్స్  క్లబ్ మరియు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరమును రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడుతూ, విద్యార్థి దశ లోనే రక్తదానాన్ని అలవాటు గా చేసుకుంటున్న కళాశాల విద్యార్థులను అభినందనీయులని, 18 సంవత్సరాల వయసు పూర్తి అయి యాభై కిలోల బరువు వున్న ప్రతి వ్యక్తి రక్తదానం చేయవచ్చని, దానమిచ్చిన రక్తం ఆరు గంటలలోపు తయారు అవుతుందని, కొత్త రక్తం రావడం వల్ల మనిషి లో చురుకుదనం పెరుగుతుందని తెలిపారు. ఎండలు ముదురు తున్న సందర్బంలో విద్యార్థులు ధైర్యంగా ముందుకు రావడం సంతోష కరమని, రక్తం డబ్బుతో తయారు చేయలేమని, కేవలం దాతల ద్వారానే లభిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బ్లడ్ బ్యాంకు లో ప్రస్తుతం రక్తం స్టాక్ లేదని, ఈ రోజు మీ క్యాంపు ద్వారా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన రక్తం దొరుకుతుందని, మీరు ప్రతి ఆరు నెలలకి ఒక సారి రక్తదానం చేయడం అలవాటు గా మార్చుకొని నిరుపేదలకు సహాయ పడాలని కోరారు. శిబిరం లో 55 మంది కళాశాల విద్యార్థిని, విద్యార్ధులు రక్తదానం చేశారు. ఈ శిబిరం లో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ రాదాకృష్ణ తో పాటు బ్లడ్ బ్యాంకు ఇంచార్జి డాక్టర్ రోహిత్, రెడ్ క్రాస్ సెక్రటరీ రమేష్ రెడ్డి, లయన్స్ అధ్యక్షులు రాధా రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, శిబిర సమన్వయ కర్త డాక్టర్ కోదండ రాములు, రీజియన్ చైర్మన్ తెప్ప శ్రీను, మాజీ అధ్యక్షులు హకీమ్ విశ్వ ప్రసాద్, రాజవర్ధన్ రెడ్డి,  చంద్ర శేఖర్ రెడ్డి, ప్రేమకుమార్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, కార్యదర్శి వాస లక్ష్మి, కోశాధికారి నాగరాణి, సభ్యులు శైలజ, లక్ష్మి, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు కృష్ణా రావు లు పాల్గొన్నారు.

Tags:  

Advertisement