నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలి

నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలి

  • ఆమనగల్లు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా

విశ్వంభర, ఆమనగల్లు: వాన కాలంలో దీర్ఘకాలిక పంట రుణాల కోసం రైతన్నలకు రూ. 3 కోట్లకు పైగా రుణాలను సొసైటీల ద్వారా ఇచ్చేందుకు అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ సింగల్ విండో ఛైర్మన్ గంప వెంకటేష్ గుప్త తెలిపారు. శనివారం ఆమనగల్ సింగల్ విండో కార్యాలయంలో పీఏసీఎస్ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. పీఏసీఎస్ పాలకవర్గం గడువును ప్రభుత్వం ఇటీవల ఆరు నెలలు పొడిగించడంతో మొదటిసారిగా పాలకవర్గం సమావేశమైంది. పాలకవర్గం సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు ఉన్నత అధికారులకు ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంప వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ రైతులు దీర్ఘకాలిక పంట రుణాలు ఇవ్వడం జరుగుతుందని. ఈ పంట రుణాలు జేసీబీ, ట్రాక్టర్, వరి కోత మిషన్ తదితర పనిముట్ల కోసం రుణాలు అందివ్వడం జరుగుతుందని రైతులకు మరో మారు గుర్తు చేశారు. అదేవిధంగా ఆమనగల్లు పీఏసీఎస్ పరిధిలో ఆమనగల్లు, కడ్తాల్, ముద్విన్ గ్రామాల్లో ఎరువులు విత్తనాల కొరత తీర్చేందుకు మూడు సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా ఎరువులు విత్తనాలు అందివ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆమనగల్ సింగల్ విండో వైస్ ఛైర్మన్ ధోనాదుల సత్యం, సభ్యులు జోగు వీరయ్య, బి. వెంకటయ్య, చేగూరి వెంకటేష్, దోల్యా నాయక్, దావ శ్రీపాల్, ఎనుముల జంగమ్మ, గడిగే చెన్నమ్మ, శ్రీపాతి అరుణ, సేవ్య నాయక్, సీఈఓ దేవేందర్, పీఏసీఎస్ సిబ్బంది అల్లాజీ, పద్మాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సింగల్ విండో కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమనగల్ సింగల్ విండో మహిళ సభ్యులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Tags: