విద్యాభివృద్ధికి పేద పిల్లల అభివృద్ధికి ఎంతో సేవ చేశారు:  అధ్యక్షుడు టి తిరుపతిరెడ్డి.

విద్యాభివృద్ధికి పేద పిల్లల అభివృద్ధికి ఎంతో సేవ చేశారు:  అధ్యక్షుడు టి తిరుపతిరెడ్డి.

విశ్వంభర, ఎల్బీనగర్ ; ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని, దాదాపు 30 సంవత్సరాలు పైగా విధి నిర్వహణలో అంకితభావంతో ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులను ఉన్నతంగా ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తీర్చిదిద్దారని పి ఆర్ టి యు టిఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టి తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారము కర్మన్గట్ లోని లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో  మలక్పేట్ లో  ప్రధానోపాధ్యాయురాలు  విజయలక్ష్మి  ఉద్యోగ విరమణ అభినందన సభకు ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ వృత్తిని దైవంగా భావిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందజేయడంతో పాటు, క్రమశిక్షణ, జీవితంలో ఎదగాలంటే ఎలా కష్టపడాలో తెలియజేసేలా వారికి తెలిపేదని అన్నారు. ఏ పనైనా సమర్థవంతంగా పూర్తి చేస్తూ ఎందరో ఉన్నత అధికారుల మన్ననలు పొందారని అన్నారు. వారు విద్యాభివృద్ధికి పేద పిల్లల అభ్యున్నతికి ఎంతో సేవ చేశారని ఆమె సేవలను కొనియాడారు.ఈ  కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ సైదాబాద్ మండల అధ్యక్షులు అంజనేశ్వర్ రావు , జిల్లా ఉపాధ్యక్షులు మందాడి వెంకటరెడ్డి , శ్రీవాణి, ప్రద్యుమ్న రెడ్డి నరసరాజు  పాల్గొన్నారు.

Tags: