స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాలి:  అధ్యక్షుడు దార నగేష్. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాలి:  అధ్యక్షుడు దార నగేష్. 

విశ్వంభరా,  కొత్తగూడెం : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాలి అని కొత్తగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దార నగేష్ అన్నారు. ఆగస్టు 3 వ తేదీన హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని   అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణలో అన్ని జిల్లాల ఆర్యవైశ్యులు పాల్గొని వైశ్య రాజకీయ రణబేరి ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో   ఉమామహేశ్వర రావు,కంభంపాటి రమేష్, కోదుమూరి శ్రీనివాస్, పల్లబోతు సాయి, జర్నలిస్ట్ రామకృష్ణ,చిట్లూరి కిషోర్, కోదుమూరి మళ్ళిఖార్జున్, కొదుమూరి సత్యనారాయణ,చీమకుర్తి రాజమనోహర్, బుక్క ఈశ్వరయ్య, కోడుమూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: