దుబ్బాకలో ముందస్తు బడిబాట

దుబ్బాకలో ముందస్తు బడిబాట

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, దుబ్బాక గ్రామంలో గురువారం రోజు ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా "మన ఊరి బడిలోనే మన పిల్లలను చేర్పించండి" "ప్రైవేటు బడి వద్దు ప్రభుత్వ- బడి ముద్దు" అనే నినాదంతో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని మునిపంపుల కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొడ్డి స్వామి కరపత్రం ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాల గురించి, ఉపాధ్యాయుల గురించి తెలుపుతూ పాఠశాల కార్యక్రమాలను గుర్తు చేస్తూ, ఊరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి అందరూ కృషి చేయవలసిందిగా కోరారు.  పాఠశాల ప్రదానోపాధ్యాయులు కొలను లలిత, ఏ.ఏ.పిసి చైర్మన్ తుమ్మల పల్లవి  మాట్లాడుతూ, గత సంవత్సరంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలను తెలుపుతూ, ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలను సాధించే విధంగా కృషి చేయగలరని కోరినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి.రేణుక, డి.ధనమ్మ, సి.హెచ్.రవి, అంగన్వాడి టీచర్ సరళ, గ్రామ ప్రజలు, యువతీ యువకులు పాల్గొన్నారు.

Tags: