అమావాస్య అన్న ప్రసాద వితరణ 

అమావాస్య అన్న ప్రసాద వితరణ 

విశ్వంభర, కని మెట్ట/ కొత్తకోట/ వనపర్తి :-  శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చివరి శనివారం, అమావాస్య రోజున వనపర్తి వాస్తవ్యులు లింగం హరినాథ్ దంపతులు కని మెట్ట హనుమాన్ మందిరంలో (ఎన్ హెచ్ 44) 300 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు, లింగం హరినాథ్ మాట్లాడుతూ ఆంజనేయుని కృప మాపై ఉండాలని మళ్లీ ఇలాంటి అన్నదానాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Tags: