శ్రీ సీతారామచంద్రస్వామి వారికి లక్ష నూట పదహార్లు విరాళం - అందించిన పొట్లూరి విజయలక్ష్మి.
విశ్వంభర, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో కూడిన సేవా కార్యక్రమం నిర్వహించబడింది. భద్రాచలం శాంతినగర్ కాలనీలో నివసిస్తున్న పొట్లూరి విజయలక్ష్మి , స్వామివారి అన్నదాన నిమిత్తం రూ. 1,00,116/- విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆమె స్వయంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి కి అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారు పేర్కొంటూ, “అన్నదానం మహాదానం. ఈ విరాళం వల్ల భక్తులకు నిత్యం కొనసాగుతున్న అన్నదానంలో మరింతసహాయపడుతుంది. భగవంతుని దీవెనలువిజయలక్ష్మి గారిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం,” అని అన్నారు. విజయలక్ష్మి గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న భక్తురాలు. ఆమె దాతృత్వం భక్త సమాజానికి ఆదర్శప్రాయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భక్తి, నమ్మకాలను బలోపేతం చేస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.