రాజకీయ వైశ్య రణభేరి విజయవంతం చేయాలి -ఆర్యవైశ్య పోరాట సమితి అధ్యక్షుడు  ప్రేమ్ గాంధీ

రాజకీయ వైశ్య రణభేరి విజయవంతం చేయాలి -ఆర్యవైశ్య పోరాట సమితి అధ్యక్షుడు  ప్రేమ్ గాంధీ

IMG-20250731-WA0010ప్రజా విశ్వంభర, హైద్రాబాద్ ;  ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యం లో జరిగే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమం ను విజయవంతం చేయాలనీ ఆర్యవైశ్య పోరాట సమితి అధ్యక్షుడు  ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైశ్య వికాస వేదిక , రాజకీయ వైశ్య రణభేరి అధ్యక్షలు డా. కాచం సత్యనారాయణ గుప్త ముఖ్య అతిధిగా హాజరై పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాల్సిందేనని అన్నారు. ఈ డబ్ల్యూ ఎస్ లో వర్గీకరణ తేవాలని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా వైశ్యులను గుడి , బడి వద్ద సేవ కార్యక్రమాలకు వాడుకుంటున్నారే తప్ప, రాజకీయంలో సీట్లు కేటాయించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సతీష్ గుప్తా,  భాగ్యనగర్ అధ్యక్షులు శంకర్ ,  మీడియా కన్వీనర్ ఉదయ్ కుమార్ , నాయకులు దొంతు చెన్నకేశవ శెట్టి,  నాగరాజు,  సంతోష్,  విజయ్,  రాజ్ కుమార్,  చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: